Ramachandrapuram Division Old Ramachandrapuram Nagulamma Temple
రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం నాగులమ్మ ఆలయం నుంచి రాయసముద్రం చెరువు చుట్టూ ఉన్న రోడ్ వద్ద స్థానికుల వినత మేరకు రోడ్ ఇరువైపులా వాకింగ్ చేసే చుట్టూ ప్రక్కల చెత్త చెదారం బాగాపెరిగి,పిచ్చిమొక్కల వల్ల పాములా బెడద బాగా ఉంది అని తెలుపడంతో స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్,ఎస్ఎస్ వెంకటేశ్వర్లు తో కలిసి జిహెచ్ఎంసి,ఎంతమాలజి సిబ్బంది తో గ్యాంగ్ వర్క్ పెట్టి శుభ్రం చేయించడం జరిగింది.ఎక్కడపడితే అక్కడ చెరువు చుట్టూ గుర్తుతెలియని వ్యక్తులు చెత్త వేస్తున్నారు అని,దాని వల్ల దుర్వాసనతో చుట్టూ ప్రక్కల అపార్ట్మెంట్స్ వాసులు ఇబ్బంది పడుతున్నారు అని వెంటనే చెత్త వెయ్యకుండా నియంత్రణ చెయ్యాలి అని కార్పొరేటర్ డిప్యూటీ కమీషనర్ కి ఆదేశించడం జరిగింది.వారితో మహేందర్ రెడ్డి,ఎర్ర మల్లి,సీఎం మల్లేష్,ఎస్ఆర్ పి మల్లికార్జున్,సుమన్,శ్రీను,శోభా,రజిని తదితరులు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-14-at-10.30.50-1024x620.jpeg)