TEJA NEWS

నగరం.. రామనామం..!

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్,డిప్యూటీ మేయర్, గ్రామ పెద్దలు

అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధాన అర్చకులు రాము పంతులు & శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నిజాంపేట్ , (శ్రీ అభయాంజనేయ స్వామి చైర్మన్)డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, వారి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక పూజలో మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి, కోలన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ రాజ్ మోహన్ రెడ్డి, శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నిజాంపేట్ కమిటీ సభ్యులు హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో రాముడి నామ జపం హోరెత్తింది. శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నిజాంపేట్ & నిజాంపేట్ మార్వది మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి ప్రత్యక్ష ప్రసారం ప్రత్యేక పూజలు, ఎల్ఈడీ స్క్రీన్ లో తిలకించారు. అనంతరం అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి (సిఐ) ఉపేందర్ రావు , (ఎస్ఐ) లు సత్యనారాయణ, రమేష్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్,రవి కిరణ్, కో ఆప్షన్ సభ్యులు తల్లారి వీరేష్, సీనియర్ నాయకులు బొర్రా చందు, సురేష్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు బైండ్ల నగేష్, నాగరాజ్ యాదవ్, తల్లారి సాయి, ప్రవీణ్, ప్రేమ్, లక్ష్మ రెడ్డి, మహేందర్, మహిపాల్, సుధాకర్ రెడ్డి, గ్రామ, పెద్దలు,శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నిజాంపేట్ కమిటీ సభ్యులు, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS