TEJA NEWS

Thanks to print and electronic and social media friends for sharing people's problems and helping us : Collector S Venkatrav.

ప్రజల సమస్యలను మాకు తెలిపి సహకరించినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు : కలెక్టర్ ఎస్ వెంకట్రావ్.

సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో పనిచేసినంతకాలం ప్రింట్ , ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియా జర్నలిస్టులు జిల్లాలో ఎక్కడ సమస్యలు తలెత్తిన వెంటనే కలెక్టర్ దృష్టికి వచ్చేలా చేసి అధికారులచే సమస్యను వెంటనే పరిష్కరించేలా తోడ్పడినందుకు అలాగే జరిగిన గత ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు నుంచి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ కూడా అదే మద్దతు కోపరేషన్ అందించాలని మాజీ కలెక్టర్ వెంకట్రావు మీడియా మిత్రులకు కోరారు. ఆదివారం నాడు కలెక్టర్ విధుల నుండి రిలీవై, నూతన కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఐఏఎస్ కు చార్జ్ అప్పగించడం జరిగిందని మాజీ కలెక్టర్ తెలిపారు.


TEJA NEWS