Corporator Venkatesh Goud inspected the CC road construction works
124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని శ్రీ తులసి నగర్ లో సీసీ రోడ్ల కొరకు గతంలో ఇరవై లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్లను మంచిగా క్యూరింగ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, సంతోష్ బిరాదర్, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-21-at-13.08.02-1024x983.jpeg)