TEJA NEWS

కొమురవెల్లి మల్లన్న పట్నం వారం ఆదాయం ఎంతంటే

చేర్యాల, జనవరి 23 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం(Patnam vaaram) సందర్భంగా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్జీత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.11,84,726, ఆదివారం రూ.47,82,420, సోమవారం రూ.10,55,161 ఆదాయం వచ్చిందన్నారు.

గత సంవత్సరం పట్నం వారానికి రూ. 49,83,819 ఆదాయం(weekly income) మల్లికార్జున స్వామి వారి ఖజానాకు సమ కూరినట్లు తెలిపారు. నిరుడితో పోల్చితే ఈసారి రూ.20,38,488 అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.


TEJA NEWS