TEJA NEWS

Distribution of free text books in Govt Junior College

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

భూపాలపల్లి జిల్లా:
భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవ త్సరం చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు అందజేశారు.

తాడిచర్ల కళాశాల ప్రిన్సి పాల్, భూపాలపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారి దేవారాజాం ఆదేశాల మేరకు ఈరోజు ఇంటర్ విద్యార్థి,విద్యార్థినీలకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి బీటెక్, బి ఫార్మసీలో సీటు పొందినటు వంటి 20 మంది విద్యార్థుల ను ప్రిన్సిపాల్, అధ్యాపకు లు అభినందించారు.

అలాగే తాడిచర్ల జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థు లకు ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నా రు. కళాశాలలో ల్యాబ్ సౌకర్యం ఇతర అన్ని వసతులు ఉన్నాయని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దూర ప్రాంతా నికి వెళ్లకుండా అందుబాటు లో ఉన్నటువంటి కళాశాల లో ప్రవేశం పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లైబ్రేరియన్ రవీందర్, నరేందర్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, స్వరూప రాణి, నరేష్, రమేష్, భరత్ రెడ్డి, జైపాల్, ఉమామహే శ్వరి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు….


TEJA NEWS