పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య
హైదరాబాద్
అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో సిద్ధిక్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేసాడు
విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు పోలీసులు.
ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సిధ్దక్ కోసం పోలీసులు వెతుకుతు న్నారు. కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య కి గల కారణాలు అక్రమ సంబంధంగా మరో ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
ఫలక్ నామ ఎసిపి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు.