జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం
అనగా తేదీ 12 ఫిబ్రవరి 2024 నా శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాఠశాలల్లోని విద్యార్థులకు డి వార్మింగ్ మందుల గురించి డాక్టర్ రేవతి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, మహాలింగాపురం ప్రధానోపాధ్యాయులు నరహరి, కొత్తపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలో ఉన్న వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య గారికి 26 జనవరి న జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఉత్తమ జిల్లా అవార్డు ను అందుకొన్నారు దీనికై ఈరోజు శంకర్పల్లి మండల ఉపాధ్యాయుల సన్మానం చేశారు. కార్యక్రమంలో మహారాజ్ పేట్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాహేర్ అలీ, కొత్తపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, జన్వాడ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు దేవేందర్ రెడ్డి, బుల్కాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనజా రెడ్డి, ప్రాథమికోన్నత పాఠశాల మోకిలా ప్రధానోపాధ్యాయులు పద్మజ, ఎంపీ యుపిఎస్ ఉర్దూ మీడియం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నౌషిన్ సుల్తానా, కొండకల్ తాండ ఉపాధ్యాయులు మరుపల్లి అశోక్, బాలమణి, ప్రణీత, విజయలత, రాజేశ్వరి, ఆరిఫ్ పాషా, రమేష్, జంగయ్య,అందరూ కలిసి మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య గారికి పూలదండ, శాలువాతో సన్మానం చేయడం జరిగింది