భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

TEJA NEWS

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం
రాముని సేవకే అంకితమైన గొప్ప రామభక్తుడు
మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచలం దేవస్థానం అపర రామదాసుగా కీర్తించిన రామకోటి రామరాజకు ఆధ్యాత్మిక సేవా రంగంలో భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న శుభ సందర్బంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ అపర రామదాసుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన రామకోటి రామరాజు తన జీవితాన్ని రామునికే అంకితమిచ్చిన మహా భక్తుడన్నాడు. రామ నామాన్ని గత 25సంవత్సరాల నుండి లక్షల మంది భక్తులతో రామకోటి వ్రాయించడం రామకోటి రామరాజుకే చెందిందన్నాడు. తెలంగాణ రాష్ట్రం నుండి రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ గౌరవ పురస్కారం దక్కడం మనకే కాదు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ రహీమ్, బొగ్గుల చందు, దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, పంబాల అర్చన శివకుమార్, తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి