గుడి నిర్మాణ దాతకు ఘన సన్మానం
చిలుకూరు సూర్యాపేట జిల్లా)
చిలుకూరు మండలంలోని ఆచార్యగూడెం గ్రామంలో రజకుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ మడేలేశ్వర స్వామి గుడి నిర్మాణానికి స్థల దాత లైన మైలారి శెట్టి చిన్న ఎలమందయ్యా జానకమ్మ దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాతలు మైలార్ శెట్టి బిక్షమయ్య కనకమ్మ గార్ల కుమారులు మైలారి శెట్టి కృష్ణయ్య- సుజాత, మైలారి శెట్టి భాస్కర్-రాజేశ్వరి దంపతులు గుడి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముసి శ్రీనివాస్, మొలుగురి నాగరాజు ,రాంబాబు, బిక్షం ,వెంకన్న ,సీతారాములు రజక కుల పెద్దలు పారెల్లి శంకర్, సోమశేఖర్ గోపయ్య రజక సంఘం గ్రామ అధ్యక్షులు పారెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు గతంలో బడికి గుడికి ఆర్థిక సహాయం అందించిన మహిళారి శెట్టి ఎలమందయ్య దంపతులను పలువురు అభినందించారు.