TEJA NEWS

కష్టకాలంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ : బిఆర్ఎస్ సీనియర్ నాయకులు…

చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 125- గాజుల రామారం డివిజన్ సుభాష్ చంద్ర బోస్ నగర్ కు చెందిన మహ్మద్ గౌసుద్దీన్ తండ్రి మహ్మద్ శంశుద్దీన్ (రూ.1,00,000/-), 128 – చింతల్ డివిజన్ భగత్ సింగ్ చెందిన జి.అశోక్ కేరాఫ్ జి.విజయ్ కుమార్ (రూ.1,15,000/-) ల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్థానిక నాయకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
వైద్యచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించిన 2.15 లక్షల రూపాయలు (1.00 లక్షలు, 1.15 లక్షలు) విలువగల రెండు ఎల్వోసీ చెక్కులను స్థానిక బిఆర్ఎస్ నాయకులు కస్తూరి బాల్ రాజ్ , అడ్వకేట్ కమలాకర్ , మక్సూద్ అలీ, బాధిత లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీవాసుల ఆరోగ్య పరిస్థితిపై మా నాయకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకువెళ్తే వెంటనే స్పందించే గొప్ప మనసున్న నాయకులు మా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మల్లేష్, ఇర్ఫాన్, శౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS