TEJA NEWS

Mar 19, 2024,

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం
దంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. అధిక వడ్డీలు, రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.2.50 కోట్లు మోసపోయినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.


TEJA NEWS