ఓటర్లకు కీలక సూచన.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

ఓటర్లకు కీలక సూచన.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

TEJA NEWS

స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్‌ ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అన్నిటికీ మించి యువతను ఓటింగ్‌ ప్రక్రియలో ఎలా భాగస్వాములను చేయాలి అనే చర్చ జరుగుతోంది. తెలుగు నాట మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరుగుతున్న తరుణంలో.. ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నంలో ఉన్నారు ఎన్నికల అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండనుంది. ఓటర్లు అందరూ వారి ఓటు హక్కును రేపు వినియోగించుకోనున్నారు. ఓటు వేయాంటే ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్ వంటివి ఉండాలి. ఇప్పటికే ఓటర్లకు ఈ ఓటర్ స్లిప్స్ అంది ఉంటాయి. ఒక వేళ ఇవి లేకపోతే.. ఏం చేయాలి? ఓటు వేయవచ్చా? లేదా? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

1) ఓటర్ గుర్తింపు కార్డు 2) ఆధార్ కార్డు 3) ఎం.ఎన్.ఆర్.ఇ. జి.ఏ.జాబ్ కార్డు 4) ఫోటోతో ఉన్న బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్ 5) కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు 6) డ్రైవింగ్ లైసెన్స్ 7) పాన్ కార్డ్ 8) కార్మిక మంత్రిత్వ శాఖ పథకం ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు 9) పాస్‌పోర్ట్ 10) ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ 11) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు 12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు 13) యూనిక్ డిసేబిలిటీ గుర్తింపు కార్డు

Print Friendly, PDF & Email

TEJA NEWS