
ఆలపాటి గెలుపుతో ప్రవేటు ఉపాధ్యాయ రంగానికి లాభం చేపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం వ్యవస్థాపకులు షేక్.జాఫర్.
కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఆలపాటి. రాజేంద్రప్రసాద్ను భారీ ఆదిక్యంతో గెలిపించాలని,ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం వ్యవస్థాపకులు షేక్.జాఫర్ అన్నారు. పట్టణంలోని ఒక ప్రైవేటు విద్యాసంస్థలో ప్రైవేటు ఉపాధ్యాయులచే కరపత్రం ఆవిష్కరించారు.తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందు, అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఆలపాటి సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. అనుభవం, వ్యక్తిత్వం, కలగలిసిన వ్యక్తి ఆలపాటి అని, ఆయన గెలుపుతో ప్రవేటు ఉపాధ్యాయ రంగానికి లాభం చేకూరుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో 9 సార్లు డీఎస్సీ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతకు – ప్రైవేటు ఉపాధ్యాయులకు మేలు చేకూరిన ప్రభుత్వ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపకులు షేక్.జాఫర్,చుండి శివప్రసాద్, సహచర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
