TEJA NEWS

కనపడకుండా పోయిన ఒగ్గు విఠలయ్య … మృతదేహంగా లభ్యం

పోస్టుమార్టo నిమిత్తం సంబంధిత వైద్యులను ఘటనా స్థలానికి పంపించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్పల్లి : కొండకల్ గ్రామంలో గత వారం రోజులుగా కనపడకుండా పోయిన ఒగ్గు విఠలయ్య (70) ఉదయం శవంగా గుర్తించబడ్డాడు. గ్రామంలోని రైతులు తమ పొలాల్లో పనులు చేస్తున్నప్పుడు విఠలయ్య మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది,విఠలయ్య జీవితం ఎలా ముగిసిందనే ప్రశ్నలు చుట్టూ తిరుగుతున్నాయి.ఈ ఘటనపై స్పందించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మృతదేహాన్ని పరిశీలించేందుకు సంబంధిత వైద్యులను ఘటనా స్థలానికి పంపించారు. పోస్టుమార్టం నిర్వహించడం ద్వారా మృతుడి మృతి కారణాలను పరిశీలించాల్సి ఉంది. గ్రామంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాధిత కుటుంబానికి కాలే యాదయ్య సానుభూతి తెలిపారు


TEJA NEWS