తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక…
ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని.. గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉండనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడి గా మారుతుంది. గత సంవత్సరం తో పోల్చితే చలి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవి లో ఉండ నుంది అని అంటున్నారు నిపుణులు.
మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి సమ్మర్ సుర్రు మనడానికి రెడీ అవుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణ లో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. దీని వల్ల భూ తాపం ఎప్పటికప్పుడు పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవి లో వడ గాల్పుల ప్రభావం చూపనుంది అని.. సమ్మర్ మొత్తం లో హీట్ వేవ్స్ కొన్ని సార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అయితే తగిన జాగ్రతలు తప్పనిసరి అని అంటున్నారు.