TEJA NEWS

చిలకలూరిపేట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

చిలకలూరిపేట
కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా పడిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చిలకలూరిపేట నియోజకవర్గ ఏఐటియుసి అధ్యక్షులు పేలురి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కార్మిక , కర్షకులకు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలిపారు. కార్మికులకు కార్మిక శాఖ ద్వారా సభ్యత్వాలను నమోదు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. నిరసన కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ సిపిఐ మాజీ ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, ఏఐటీయూసీ నాయకులు నాయుడు శివకుమార్, తన్నీరు వెంకటేశ్వర్లు, షేక్ ఖాదర్ వలీ, ఆరాధ్యుల రామకృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నాయకులు ఎన్. కృష్ణ, దాసరి లింగారావు, వేలూరు లేనిన్ యూనిట్ సిపిఐ కార్యదర్శి బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.