TEJA NEWS

హైదరాబాద్ లో డీజేలు, క్రాకర్స్ బంద్..సంచలన ఉత్తర్వులు జారీ

ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు.

పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఇంట్లో అయినా వీధిలో అయినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా డీజేల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు. డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్‌ మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ ఎటాక్‌ వచ్చి ప్రాణాలు కోల్పోతుండటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో డీజేలు,సౌండ్ మిక్సర్‌లు, హైసౌండ్ ఎక్యూప్‌మెంట్, క్రాకర్లపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపులు,వేడుకల్లో ఇకపై వీటిని వాడరాదు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టులకు 100 మీటర్ల వరకు నిషేదం అమల్లో ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించారు.

కాగా, 4 జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబిల్స్ నిర్దేశించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టంలో వాడకూడదని చెప్పారు. రాత్రి వేళల్లో 45 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్‌ లో వాడకూడదన్నారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల మత పెద్దలతో,రాజకీయ నేతలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.


TEJA NEWS