స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
ప్రత్యేకమైన, పవిత్రమైన రోజు….
భారత దేశ పౌరులందరి భవిష్యత్ ను నిర్ణయించిన రోజు…..
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు…..
రాజ్యాంగమే లేకుంటే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉండేవి కావు…..
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి…..
ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు….
రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి …..
భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించిందని, ఇది దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడుకోవడానికి సోదరభావాన్ని ప్రోత్సహిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
75వ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో మొదట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశ పౌరులందరికి పండుగ రోజని అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం లేకుంటే ఒక ఎమ్మెల్యే గా మీ ముందు ఉండే వాడిని కాదని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉండేవి కాదని అన్నారు. కావున ఆ మహానుభావునికి ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
కోమల్ల గ్రామానికి చారిత్రాత్మక చరిత్ర ఉందని, ఈ గ్రామానికి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు అవసరం లేదని, గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని కోరారు. 52లక్షలతో నేడు గ్రామ పంచాయతీ భవనానికి, అంగన్వాడీ భవనానికి, సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. కోమల్ల నుండి కంచనపల్లి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేపించి త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మరిన్ని సిసి రోడ్లకు కూడా త్వరలోనే మంజూరు ఇస్తానని అన్నారు. కోమల్ల గ్రామానికి ఈ ఏడాది 50ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల, గ్రామ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.