ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఆశలకు జీతాలు చెల్లించాలని..,.,… సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు డిమాండ్
వనపర్తి
తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) వనపర్తి జిల్లా విస్తృత సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే సునీత అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు పాల్గొని ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశ వర్కర్స్ కు 18,000 వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీని అమలు చేయకుండా ఆశ వర్కర్లకు పని భారాన్ని పెంచి వెంటనే హామీని అమలు చేసి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఆశ వర్కర్లతో అదనపు పనులు చేయించుకుంటున్నారని అదనపు పనులకు అదనపు పారితోషికం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 31 వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని ఈ బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆశ వర్కర్లను కోరారు ఆశ వర్కర్ హక్కుల సాధన కోసం వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహించాలని ఆశ వర్కర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మంజుల జ్యోతి చెన్నమ్మ సంతోష కమల స్వప్న డి సునీత కాంచన చంద్రకళ తదితరులు పాల్గొన్నారు