TEJA NEWS

సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి, రైతాంగ ఉద్యమపిత ఆచార్య రంగా .

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

గొల్లపూడిలో ఘనంగా ఆచార్య ఎన్జీరంగా 30వ వర్ధంతి.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,

సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి ఆచార్య ఎన్జీ రంగా గారు అని, రైతుల శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో దివంగత నేత పద్మవిభూషణ్ ఆచార్య రంగా 30వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆచార్య ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ “భారత స్వాతంత్ర్య సమర యోధులు, పార్లమెంటు సభ్యులు, రైతు నాయకులు ఆచార్య ఎన్జీ రంగా (గోగినేని రంగనాయకులు) నిబద్దత కలిగిన పాతతరం రాజకీయ నాయకులు. ఆయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.

సుదీర్ఘ పార్లమెంటేరియన్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కిన ప్రజాప్రతినిధి, లోక్సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ 60 ఏళ్ళు రైతుల పక్షాన పోరాడిన నాయకులు. 1935లో తొలిసారి కేంద్ర శాసనసభకు సభ్యులై అప్పటి నుంచి మరణించే వరకు నిరంతరం పార్లమెంటేరియన్ గానే కొనసాగారు.

మహాత్మా గాంధీజీ పిలుపుకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర్య పోరాటంలో నిర్విరామంగా పాల్గొన్న రంగా అనేక పర్యాయాలు జైలు పాలయ్యారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. రైతు సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో తన గళాన్ని వినిపించారు. రైతుల విప్లవోద్యమాలలో ముఖ్యభూమిక పోషించారు.

ఇటువంటి మహానీయుల అడుగుజాడల్లో నడిచి, వారి స్ఫూర్తితో మనం కూడా సమాజానికి విస్తృతమైన సేవలందించాలి.” అని శాసనసభ్యులు కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిగురుపాటి వెంకటనారాయణ , మాజీ ఎంపీపీ వడ్లమూడి జగన్మోహన్ రావు , విజయవాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు , తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నూతలపాటి వెంకటేశ్వరరావు (నారద) అధ్యక్షులు, బొర్రా తిరుపతిరావు , నూతలపాటి శివరాం , గ్రామ తెలుగు రైతు అధ్యక్షులు , గ్రామ ముఖ్య నాయకులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.