
టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం: మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని పీసీ ఘోష్, ప్రశ్నించారు ప్రాజెక్టు డిజైనింగ్ కారణాలను హరీష్ రావు వివరించారు.
జస్టిస్ విచారణకు ముందుగా వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ గోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నించింది.
తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు.
అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్ర లోనూ, తెలంగాణలోనూ, సెంట్రల్‌లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.
దాంతో తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావాడం కోసం ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్ లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్ పై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషన్ కు తెలిపారు
మాజీ మంత్రి. ఆ ప్రాంతం లో ప్రాజెక్ట్ సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చిందని, అలాగే నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ కూడా నివేదిక ఇచ్చిందని, అలాగే ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని… మూడు బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించినట్లు చెప్పుకొచ్చారు.
