సూర్యాపేట జిల్లా విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు–కందుకూరి యాదగిరి
సూర్యపేట జిల్లా : మీడియా స్వేచ్ఛను త్రోసిపుచ్చే విధంగా వ్యవహరిస్తూ ఏమాత్రం ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండకుండా వ్యవహరించిన సూర్యాపేట జిల్లా విద్యాధికారిపై సూర్యాపేట జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత స్థాయి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఒక ప్రత్యేక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాటలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇతర దేశాలకు వెళ్లిన సంగతి తెలుసుకొని అందుకు సంబంధించిన వివరాలను అడిగేందుకు పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరిన ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్టు శిగ సురేష్ పైన అతనితో వెళ్లిన జర్నలిస్టుల పైన నోటికొచ్చినట్లు మాట్లాడడం సబబు కాదన్నారు.మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారితనంగా ఉండే విధంగా వ్యవహరిస్తుందని తమ పని తాము చేసుకుంటూ పోతున్న క్రమంలో ప్రజలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు జవాబుదారితనంగా ఉండాల్సింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడడం బాధ్యత తప్పి వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు.మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేసే వారి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యాదగిరి డిమాండ్ చేశారు