రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు
- లోతట్టు ప్రాంతాల్లోనూ వాన నీరు నిలిచిపోకుండా ఏర్పాట్లు
- క్రియాశీలంగా పనిచేసిన ప్రత్యేక బృందాలు
- వాన నీటి పంపుహౌజ్‌ను పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
…
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ లోబ్రిడ్జ్ ప్రాంతంలోని వాననీటి పంపు హౌజ్‌ను పరిశీలించారు. ఈ పంపు హౌజ్ పనితీరును మునిసిపల్ ఇంజనీర్లు మంత్రికి వివరించారు. పంపుహౌజ్‌లో ఎనిమిది మోటార్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా `మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో తోడిసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మార్గదర్శనంలోని ప్రత్యేక బృందాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషించాయన్నారు. నీరు నిలిచిపోతే అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశముందని.. అందువల్ల ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
