TEJA NEWS

మల్కాజిగిరి :
ఐ సేవ్ మై ఎర్త్ క్యాంపెయిన్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న షేర్ అంబ్రేల్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్నీ నాగేంద్ర హై స్కూల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా మాల్కాజ్గిరి ట్రాఫిక్ అదనపు సీఐ మల్లేష్ ,షేర్ యంబ్రేల్ల ఫౌండర్ విజయ అర్చన పాల్గొని విద్యార్థులకు పర్యావరణం మీద అవగాహనా కల్పించి మొక్కలు నాటారు.కాలుష్యం బారీనా పడకుండా ప్లాస్టిక్ వాడకుండా మన ఆరోగ్యాలను రక్షించు కోవాలంటే ప్రతి ఒక్కరు విరివిరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ నిర్ణీత వయసు వచ్చాక, లైసెన్సు పొందిన తర్వాత మాత్రమే వాహనాలు నడపాలి లేనిచో వాహన యజమాని కూడా శిక్ష తప్పదు అని హెచ్చరించారు. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్, ఆపోజిట్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొదలగు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి వాటి వల్ల కలిగే దుష్ఫలితాల గురించి వివరించడం జరిగింది. రోడ్డుపైన నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీబ్రా క్రాసింగ్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వివరించారు.విద్యార్థులు స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస్సులో ప్రయాణించేటప్పుడు చేతులు, తల కిటికీ అద్దాల బయట పెట్టవద్దు అని, చిన్న పిల్లలను బస్సు వద్దకు రాకుండా చూడాలని అన్నారు.టూ వీలర్ నడిపేవారు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు, ఫోర్ వీలర్ నడిపేవారు సీడ్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాగేంద్ర హై స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్ కృష్ణ , ట్రాఫిక్ ఎస్ ఐ వెంకట్రామిరెడ్డి, కాలనీ సెక్రటరీ రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరీ బద్రినాథ్, షేర్ అంబ్రెల్లా సభ్యులు సందీప్, ఉపాద్యాయులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS