TEJA NEWS

అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత?

గత కొంతకాలంగా భారత బిలీయనీర్ గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొత్త కొత్త రిపోర్టులను విడుదల చేస్తోన్న అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది. 2021 నాటికే అదానీపై మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ విచారణలో భాగంగా స్విస్ అధికారులు.. అదానీ గ్రూప్‌కు చెందిన అనేక స్విస్ బ్యాంక్ అకౌంట్లలలో జమ చేసిన 310 మిలియన్ డాలర్లకు పైగా అంటే మన కెరెన్సీలో 2600 కోట్ల రూపాయల పైనే స్తంభింపజేసినట్లు హిండెన్‌బర్గ్ సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించింది.

బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ , మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదానీ అనుబంధ సంస్థ ఎలా పెట్టుబడి పెట్టిందనే దానిపై ప్రాసిక్యూటర్లు సమాచారాన్ని అందించారని చెప్పారు. స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు హిండెన్ బర్గ్ తెలిపింది.

అయితే అదానీ గ్రూప్‌కి ఎలాంటి స్విస్ కోర్టు ప్రొసీడింగ్స్‌తో సంబంధం లేదని అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ కంపెనీకి సంబంధించిన ఏ అకౌంట్ కూడా జప్తు చేయబడలేదని.. తమ విదేశీ హోల్డింగ్ నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా, చట్టానికి అనుగుణంగా ఉంటుందని అదానీ గ్రూప్ తెలిపింది. ఇది తమ ప్రతిష్టను, మార్కెట్ విలువను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిపింది.


TEJA NEWS