TEJA NEWS

యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం గోదాం నుండి అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా స్ట్రాంగ్ రూమ్ లకు ఈ.వి.ఎం. తరలింపు కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి, పరిశీలించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో 3 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని, పోలింగ్ నిర్వహణకు గతంలో కేటాయించిన ఈవిఎం యంత్రాలకు అదనంగా బ్యాలెట్ యూనిట్లను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించినట్లు తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 888 బ్యాలెట్ యూనిట్లు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, పొన్నెకల్, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 725 బ్యాలెట్ యూనిట్లనూ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, పొన్నెకల్, మధిర అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 670 బ్యాలెట్ యూనిట్లు మధిర పాలిటెక్నిక్ కళాశాల, వైరా అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 630 బ్యాలెట్ యూనిట్లు వైరా సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కి కేటాయించిన 735 బ్యాలెట్ యూనిట్లు జ్యోతి నిలయం హైస్కూల్ లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సంబంధిత అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS