Adilabad Zilla Parishad Chairman Janardhan Rathore participated in the Badi Bata program
రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా నాన్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జనార్ధన్ రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తకాలు మరియు యూనిఫామ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో
జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ బడి బాట కార్యక్రమంలో పాల్గొనడం పిల్లలతో కలవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని సూచనలు చేశారు. ఈ సందర్భంగా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన మన్సూర్ ఖాన్ తనయుడు ముజమ్మిల్ ఖాన్ ఇటీవల దేశ వ్యాప్తంగా నిర్వహించిన NEET పరీక్షలో 720 కు 633 మార్కులు సాధించారని వారికి ఆదిలాబాద్ జట్టు చైర్మన్ జనార్దన్ రాథోడ్ శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు.
మన ఊరు మన బడి అన్నప్పుడు మన ఊరిలో ఉన్న ప్రభుత్వ బడిలో మనం చదువుకోవాలని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు ప్రవేటు పాఠశాలల కంటే మార్కులు దాటుతున్నాయని అన్నారు. ప్రవేటు పాఠశాలల్లో ఎవరైనా బోధించొచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక టెస్టులు పెట్టి ఎంపిక చేసి ఉపాద్యాయులుగా మన పాఠశాలలకు పంపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కనక మోతు బాయి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్,మాజీ AMC చైర్మన్ జాధవ్ శ్రీరామ్ నాయక్, PACS చైర్మన్ సురేష్ ఆడే, కో ఆప్షన్ నెంబర్ దస్తగిర్, మాజీ ఉపసర్పంచ్ Ch మహేందర్, ఎంపీపీ తనయుడు కనక ప్రభాకర్, సయ్యద్ ఖాసిం, బాబా ఖాన్, టౌన్ ప్రెసిడెంట్ ఫిరోజ్, ముంతాజ్, సుభాష్ రాథోడ్, హైమద్, అధికారులు MEO, AO, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.