అద్వితీయ భరితంగా అభిమాన నాయకుని జన్మదిన వేడుకలు….
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు – సభ్యులు, కార్మిక నాయకులు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు, అభిమానులు “జై వివేకన్న” నినాదాల మధ్య భారీ కేక్ కటింగ్, పుష్పగుచ్చాలనందిస్తూ శాలువాలు కప్పి అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.