TEJA NEWS

ఐకెపి కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలిస్తున్న ఏ ఈ ఓ జానయ్య

సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో గల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏఈఓ జానయ్య ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాన్యం తేమశాతం రాకపోతే రైతు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ధాన్యాన్ని కల్లాల్లో నుండి కేంద్రాలకు తెచ్చి అలాగే కుప్పలుగా ఉంచుతున్నారని అది సరైన పద్ధతి కాదన్నారు.పూర్తిగా ఆరబెట్టుకుంటేనే ప్రభుత్వ నిర్ణయించిన తేమ శాతం వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు వెంకట్ రెడ్డి ఐకెపి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS