మేడే ను జయప్రదం చెయ్యండి.కార్మికులకు ఏఐటీయూసీ నాయకుల పిలుపు.

మేడే ను జయప్రదం చెయ్యండి.కార్మికులకు ఏఐటీయూసీ నాయకుల పిలుపు.

TEJA NEWS

138 వ మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని కార్మికులు పాల్గొనే ఏకైక కార్యక్రమం మేడే నని అందులో భాగంగానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్మికులు కూడా మేడే కార్యక్రమాల్లో పాల్గొని నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటు రాబోయే రోజుల్లో కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి చేయాల్సిన కార్యక్రమాలను చర్చించుకుని కార్మిక రాజ్య స్థాపన కొరకు నడుంబిగిద్దామని అందుకోసం అన్ని శాఖల కార్యదర్శులు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. 8 గంటల పనిదినాలు కోసం, 24 వేలు కనీస వేతనాల కోసం,ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కొరకు,ఈ ఎస్ ఐ, పెన్షన్ అమలు కొరకు పోరాడాలని,ఈ సదుపాయాలు కలగాలంటే కేవలం కార్మిక రాజ్యం స్థాపన ద్వారానే సాధ్యం కావున ప్రతి ఒక్కరు లక్ష్యాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసురత్నం, సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి,కార్యదర్శి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ రావు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS