TEJA NEWS

యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా అజయ్ కుమార్
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన అశోద అజయ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన గెలుపు సహకరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందేలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తానని తెలిపారు. నిరుద్యోగ యువత సమస్యలు ప్రభుత్వానికి తెలియచేసి పరిష్కారం జరిగేలా చూస్తామన్నారు


TEJA NEWS