హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ కిందికుంట పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సానుకూలంగా స్పందిస్తూ పార్క్ లోకి వాకింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పటికే ఓపెన్ జిమ్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, పార్క్ చుట్టుపక్కల మొక్కలు, పుట్‌పాత్‌లపై బెంచీలను ఏర్పాటు చేస్తామని. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్
Related Posts
సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి
TEJA NEWS సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు చెబుతున్న ప్రజాపాలన ప్రజాపీడనగా మారిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీఐ కింద అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..…
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ
TEJA NEWS అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి, బీసీ కులాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున…