నిత్య కృషి వలుడు.. అక్షర యోధుడు రామోజీరావు

నిత్య కృషి వలుడు.. అక్షర యోధుడు రామోజీరావు

TEJA NEWS

Nitya Krishi Neta.. Akshara Yodha Ramoji Rao

నిత్య కృషి వలుడు.. అక్షర యోధుడు రామోజీరావు
టియుడబ్ల్యూజే (ఐజేయు) ఘన నివాళులు
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సంతాప సభ
రామోజీ అంటే ఒక నమ్మకం, విశ్వాసం: రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్ నారాయణ

నిత్య కృషి వలుడు.. అక్షర యోధుడు రామోజీరావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి అని అన్నారు. సమాజంలో చైతన్యం, సామాజిక సేవ, ఆయన ఏ పని చేపట్టిన అందులో కొత్త వరవడి సృష్టించారన్నారు. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు అకాల మరణం పట్ల టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మృతికి నివాళులర్పిస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. రామోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్
జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టేకొల రామనారాయణ మాట్లాడారు. నిత్య కృషి వలుడు.. అక్షర యోధుడు రామోజీరావు అని కొనియాడారు. రామోజీ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసమన్నారు. ఖమ్మంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమ సభలో రామోజీరావు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక సంఘ సంస్కర్త అని కొనియాడారు. రామోజీరావు ప్రారంభించిన పత్రిక, సినిమా, పచ్చళ్ళు, వస్త్రాలు ఫిలిం సిటీ ఇతర వ్యాపారం ఏదైనా తన ముద్ర వేశార న్నారు. పత్రికా రంగంలో అబద్దాలు ఆడకూడదు, నిజాలు రాయాలి, సమాజానికి ఉపయోగపడాలని నిత్యం పరితపించేవారని అన్నారు. రామోజీ రావు లాంటి వ్యక్తులు దొరకటం బహు అరుదన్నారు. ఈనాడులో ఏదైనా వార్త వస్తే అది గెజిట్ గా అధికారులు భావించిన రోజులు ఉన్నాయన్నారు. అనేక మందిని కలం సైనికులుగా తీర్చిదిద్దారని కొని యాడారు. రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగ, ఉపాధి ద్వారా అనేక కుటుంబాలు బాగుపడ్డాయన్నారు.
ఆయన వంద సంవత్సరాలు బతుకుతారని అనుకున్నాను అంతలా వ్యాయామం, ఆహారపు అలవాట్లు, శరీర నిర్మాణం ఉండేదని విన్నాని కానీ ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మరణం పత్రిక రంగానికి తీరని లోటన్నారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణు, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు నలజాల వెంకట్రావు, ఖమ్మం నగర అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు, , జిల్లా నాయకులు గోగిరెడ్డి శ్రీనివాస రెడ్డి యన్ శివ కె. గోపి మొయినుద్దీన్, నామ పురుషోత్తం కె వెంకటేశ్వర్లు కళ్యాణ్ చక్రవర్తి, నాగేందర్ రెడ్డి, మధులత, ఈనాడు సీనియర్ పాత్రికేయులు అర్జున్ సింగ్ మాట్లాడారు. రామోజీరావు సేవలు, ఈనాడు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ, భూపాల్, వేణు,
ఈనాడు విలేకరులు లాల, శేష వర్ధన్ రెడ్డి, ఉపేందర్(ఈటీవీ), పవన్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS