శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆలిండ్ ఎంప్లాయిస్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆలిండ్ ఎంప్లాయిస్

TEJA NEWS

Aland Employees under Serilingampally Division

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆలిండ్ ఎంప్లాయిస్ కాలనీ,సుదర్శన్ నగర్ కాలనీలలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

ఈ సంధర్భంగాఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆలిండ్ ఎంప్లాయిస్ కాలనీ మరియు సుదర్శన్ నగర్ కాలనీల లో గత కొన్ని రోజులుగా మంచి నీటి సమస్య ఎదురైనది అని, తక్కువ ప్రెజర్ తో మంచి నీరు వదులుతున్నారు అని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గాంధీ సంబంధిత అధికారుల తో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య ను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని ,మంచి నీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని ,మళ్ళీ పునరావృతం కాకుండా చూడలని, ప్రజలకు స్వచ్చమైన త్రాగు నీరు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు సరిపడా మంచి నీరు అందించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అదేవిధంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ఆలిండ్ ఎంప్లాయిస్ కాలనీ, సుదర్శన్ నగర్ కాలనీల అభివృద్ధి కి శాయాషెక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు, త్వరలోనే కాలనీల లో పర్యటిస్తామని, నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అదేవిధంగా కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సత్యనారాయణ, సత్యం, జీవరత్నం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, సాయి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్, ఉన్నం ప్రసాద్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి