TEJA NEWS

చేవెళ్ల:
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో అందరితో కలిసిమెలిసి ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. ఆమెతో పాటు మాజీ సర్పంచ్ అనంతరాములు, మాజీ ఎంపిటిసి శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ షబ్బీర్, మాజీ వార్డు సభ్యులు వసంత, సువర్ణ, రవికుమార్, గ్రామ అధ్యక్షుడు యాదయ్య, శ్రీనివాస్, మాణిక్యం, పాష, రాము, యాదయ్య, పాండు, రాజు, రుక్కయ్య కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS