
సాక్షి కార్యాలయాన్ని ముట్టడించిన అమరావతి మహిళలు
అమరావతి:
సాక్షి డెబిట్ లో రాజధాని మహిళను ఉద్దేశించి వాడిన అసభ్యకర పదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కూటమి పార్టీల మహిళతో పాటు రాజధాని ప్రాంతం మహిళలు రోడ్లెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక విజయవాడలోని సాక్షి కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు.
సాక్షి కార్యాలయం బోర్డును సైతం మహిళలు ధ్వంసం చేశారు.సాక్షి మీడియాలోని చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాజధాని వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యా ఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆ క్రమంలో సాక్షిలో ప్రసారమైన చర్చ వేదికలో కొమ్మినేని సైతం ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. దీంతో ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు. అదీకాక ఈ వ్యవహారంలో కొమ్మినేని, కృష్ణంరాజుతో పాటు సాక్షి యాజమాన్యం పై కేసు నమోదు చేశారు
