TEJA NEWS

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్.. ఆ వర్సిటీలపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు

ఇప్పటికే భూ కబ్జా కేసులతో
సతమతమవుతోన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారు ప్రాంతాలైన దూలపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ, బాలానగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపైస్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ యూజీసీకి హైకోర్టులు ఆదేశాలు జారీ చేసింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు క్యాంపస్ను ఏర్పాటు చేశారంటూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం వర్సిటీలపై చర్యలకు ఆదేశించింది. అయితే, కేసు విచారణను తిరిగి జూలై 24కు వాయిదా వేసింది. ఒకవేళ మల్లారెడ్డి స్థాపించిన వర్సిటీలు అక్రమం అని తేలితే క్యాంపస్లను శాశ్వతంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి…


TEJA NEWS