TEJA NEWS

శంకర్‌పల్లిలో చేతులు, తల లేని గుర్తుతెలియని మృతదేహం లభ్యం

శంకర్‌పల్లి:చేతులు తల లేని గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ఆదర్శ పాఠశాల పక్కన గల ఓ సంపులో సాయంత్రం గుర్తు తెలియని చేతులు, తలలేని మృతదేహం లభ్యమైందని తెలిపారు. మృతదేహం గుర్తు పట్టనట్టుగా, నీటిలో బాగా తడిచి ఉంది. జీన్స్ ప్యాంటు బెల్ట్ ధరించి, బూట్లు వేసుకుని ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు. క్రైమ్ ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు.


TEJA NEWS