TEJA NEWS

అలంకరణలకు ప్రత్యేకంగా నిలిచిన మల్కాజ్గిరి లోని ఆనంద్ బాగ్ లో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక చందనోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు…

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ… స్వామివారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక చందనోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని… స్వామివారికి
ఉదయం ప్రభాత ఆరాధన, బాల భోగం ..విశ్వక్సేన ఆరాధన, పుణ్యావాచనము అనంతరం శ్రీవారికి 108 కలశాలతో శతఘటాభిషేకం… 108 లీటర్ల పాలు, పంచామృతాలతో, సుగంధ జలాలతో, ఫల రసాలతో అభిషేక అనంతరం శ్రీవారికి చందన కాప్పు సేవ, ఆరగింపు.. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు.. పంచిపెట్టామని… భక్తులు అధిక సంఖ్యలో భక్తి పారవశ్యంతో స్వామివారి కార్యక్రమాలను తిలకించి మహదానందం పొందారని వివరించారు…

దేవాలయంలో స్వామివారి సేవలను వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కి ఇష్టమైన గోవింద నామ సంకీర్తన చేస్తూ స్వామివారిని భక్తి పారవశ్యంతో స్తుతించారు…

ఇంతటి మహదానందాన్ని పంచిన ఆలయ సిబ్బందికి స్వామివారి సేవకు సహకరించిన స్వామి సేవకులకు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు


TEJA NEWS