TEJA NEWS

నాగపురి ఉన్నత పాఠశాలను సందర్శించిన అందెశ్రీ


సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ సందర్శించారు అందెశ్రీ వ్రాసిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన తరువాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐలయ్య ఉపాధ్యాయులు ఆయనను ఆహ్వానించి విద్యార్థులకు ప్రత్యక్ష పరిచయం చేయాలని భావించారు పదవ తరగతి చదువుతున్న దాసరి అర్చన అనే విద్యార్థిని చరవాణిలో అందెశ్రీ తో మాట్లాడుతూ మీ దర్శన భాగ్యం కావాలని కోరింది అందరి ఆహ్వానం మేరకు అందెశ్రీ అంగీకరించి గురువారం నాడు పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి అందెశ్రీ మాట్లాడుతూ జన్మించిన తల్లిదండ్రులను గురువులను గౌరవించాలన్నారు సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నారు చదువును మించిన సంపద ఈ సృష్టిలో లేదన్నారు తనకు గల 12 రకాల గురువుల గురించి వివరించారు కులమత బేధాలకు అతీతంగా ప్రకృతి దగ్గర జీవించాలన్నారు తాను బడికంటూ పోలేదని అలుకాబలపం పట్టలేదని అక్షరాలు నేర్వలేదన్నారు కానీ లక్ష పదాలు హల్లులు అంటే ప్రకృతి ప్రత్యక్ష గురువు అని వా కులం ఆశీస్సులని అన్నారు విద్యార్థులు ఇష్టంతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు తరువాత అందెశ్రీ ని ప్రధానోపాధ్యాయులు ఎలుకట్టే ఐలయ్య ఉపాధ్యాయులు ఎస్ కృష్ణమూర్తి టి పద్మ అందె విజయ్ కుమార్ టి మనోజ్ కుమార్ జి ప్రకాష్ రెడ్డి సిహెచ్ యాదగిరి కె స్వర్ణకుమార్ జి శ్రీధర్ ఫహీం సుల్తానా ఎండి ఉమర్ స్వామి బి మంజుల తదితరులు ఘనంగా శాలువతో సత్కరించారు


TEJA NEWS