TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 & 26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ నందు గల నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ సభ్యలు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి దేవాలయం వార్షికోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆ శ్రీనివాసుడిని కొలవడం ద్వారా ఆపదలు తొలగడంతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి ,నాయకులు సాంబాశివా రెడ్డి, దశరథ్ ,స్వామి, అనిల్ కరుటూరి,డివిజన్ అధ్యక్షులు స్టాలిన్ రెడ్డి, బొబ్బా శ్రీనివాస్, మేకల మధుసూదన్, బిక్షపతి,ఎన్ఎసి మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్, మహిళా నాయకురాలు శిల్ప , యువ నాయకులు, భక్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు.


TEJA NEWS