TEJA NEWS

Announcement of Indian team to tour Zimbabwe in a week

వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన!
జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలో జరగనున్నాయి. జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. 6న తొలి టీ20, 7న రెండో, 10న మూడో, 13న నాలుగో, 14న చివరి మ్యాచ్ జరగనుంది.


TEJA NEWS