Spread the love

భారత వాయుసేన అమ్ముల పొదలోకి మరో ‘అస్త్రం’..

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్ యుద్ధవిమానం (LCA) AF MK1 నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు డిఆర్డిఓ ప్రకటించింది. 100 కి.మీ పరిధిలో పైలట్ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సాయంతో ఛేదించవచ్చు.