TEJA NEWS

పట్టాలు తప్పిన మరో రైలు

కన్నూర్:జనవరి 20
కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది.

ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43 గంటలకు సర్వీసును ప్రారంభించింది. పట్టాలు తప్పిన కోచ్‌లను రైలు నుండి తొలిగించారు.

ఈ ఘటనలో సిగ్నల్ బాక్స్ ధ్వంసమైంది. అధికారులు విచారణ చేపట్టారు


TEJA NEWS