TEJA NEWS

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది..

భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఎదురుకాల్పులు చోటుచేసుకున్న చోట ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు..


TEJA NEWS