TEJA NEWS

చత్తీస్ ఘడ్ లో మళ్లీ ఎదురు కాల్పులు?

హైదరాబాద్:
మరోసారి ఛత్తీస్‌గఢ్‌‌ కంకేర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకు న్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఇటీవల జరిగిన కాల్పుల్లో 29 మంది మృతిచెందన ఘటన మరువక ముందే మరోసారి భారీ స్థాయిలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.

ఉదయం నుంచి మావోయిస్టులు బిఎస్ఎఫ్ దళాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. నారాయణ‌పూర్, కంకేర్ జిల్లా కోయలిబెడ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తు న్నారనే సమాచారంతో బిఎస్ఎఫ్ బలగాలు కూం బింగ్ నిర్వహిస్తుండగా.. తారసపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు.

ఈ ఎదురు కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరిగినట్లు తెలుస్తుంది, సంఘటన స్థలములో 12 బోర్ తుపాకులు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి..

అబుజ్‌మద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నక్సల్స్ సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో నలువైపుల నుంచి రిజర్వ్‌డ్ పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్యపై మరింత సమాచారం రావాలి. కంకేర్ జిల్లాలోని ఛోటా బెథియాలో ఇటీవల 29 మంది మావోయిస్టులను హతం అయ్యారు.


TEJA NEWS