చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్?
హైదరాబాద్:
ఛత్తీస్ ఘడ్ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఉదయం పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,
ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు. రాత్రి నుంచి అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. తెల్లవారుజాము నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యా యి.
అబూజ్ మడ్ తో పాటు రాష్ట్రంలో మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ను పెంచాయి. నెల రోజల వ్యవధిలో పోలీసుల కాల్పుల్లో సుమారు 60 మంది మావోయిస్టులు మరణించారు.కూంబింగ్ లో నారాయణపూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు పాల్గొన్నాయి.
కూంబింగ్ జరుపుతున్న తమ బలగాలకు మావోయి స్టులు తారసపడ్డారని..ఈ సమయంలో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభ మయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 22న కోంటా పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మరణిం చారు.ఈ నెల 8న బీజా పూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఓ మావో యిస్టు మరణించారు.