TEJA NEWS

ఐఏఎస్ అమోయ్ కుమార్ మెడకు మరో భూ కుంభకోణం కేసు

మరో భూకుంభకోణం కేసు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ మెడకు చుట్టుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ అధికారులకు తట్టి అన్నారం గ్రామంలోని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ జేసే భూములను మాయం చేసినట్లు ఆరోపించారు. 840 మంది ప్లాట్ ఓనర్స్‌ను అమాయకుమార్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మోసం చేశాడన్నారు.

రెవెన్యూ రికార్డుల్లో ప్లాట్ ఓనర్ల పేర్లు ఉన్నప్పటికీ ఇతరుల పేర్ల మీద అక్రమంగా ధరణిలో చేర్చి భూములను ఇతరులకు బదులాయించినట్టు ఈడీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టులో పోరాటం చేస్తున్నామన్నారు. అమోయ్ కుమార్‌పై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును సైతం పరిగణలోకి తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS