
కోర్లకుంట గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభం – అభివృద్ధి దిశగా మరో అడుగు*
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులువారిపల్లి మండలం కోర్లకుంట గ్రామంలో నిర్మితమైన సీసీ రోడ్డు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్థానిక ప్రజలు నేతలకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ :
“ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సదుపాయం అందించడం మా ముఖ్య కర్తవ్యం. రోడ్లు మెరుగుపడితే ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. కోర్లంకుంట రోడ్డు పనులు పూర్తవడం వల్ల రాకపోకలు సులభతరం అవుతాయి, ఇది ప్రజల జీవితాల్లో మార్పుకు నాంది అవుతుంది” అన్నారు.
అరవ శ్రీధర్ మాట్లాడుతూ:
“ప్రజల అవసరాల్ని గుర్తించి ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిస్వార్థంగా కృషి చేస్తోంది. రోడ్డు డెవలప్మెంట్ గ్రామ అభివృద్ధికి దారితీయడం ఖాయం. ” అని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి
ప్రతి పల్లెలో ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వ సేవలు సమర్ధవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో గ్రామాలు ప్రగతిపథంలో సాగేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ఇది పల్లెల ప్రగతికి బలమైన పునాది అవుతోంది. ప్రధానంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లొ అధికారులు, NDA కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.
